నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆగస్టు 10న జైలర్ చిత్రం విడుదలైంది. తొలి షో తర్వాత మిశ్రమ స్పందన వచ్చినా ఆ తర్వాత సూపర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జైలర్ మూవీ రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది .ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళా శంకర్ ప్లాప్ కావడంతో తెలుగురాష్ట్రాల్లో జైలర్ కు కలిసొస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తెలుగు హీరోలను అవమాన పరిచినట్లు ఉన్నాయని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో తెలుగు హాస్య నటుడు, హీరో సునీల్ క్యారెక్టర్ ని ఏపీకి చెందిన ఓ తెలివి తక్కువ హీరోగా చూపించారని మండిపడుతున్నారు. తెలుగు హీరోలు ఇలాగే ఉంటారు అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. అయితే, ఈ పోస్ట్ ల పై నెల్సన్ దిలీప్ కుమార్ టీమ్ స్పందించింది. తెలుగు హీరోలను తాము ఎప్పటికీ అవమానించం అని.. సునీల్ ను సినిమాలో కేవలం హాస్య కథానాయకుడిగానే చూపించాం అని చెప్పుకొచ్చారు.
Also Read:విజయ్ – సమంతను ఆడుకుంటున్న నెటిజన్లు!
ఇక జైలర్ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారంలోనే జైలర్ మూవీ ఓటీటీలోకి వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కాకపోతే దీపావళికి చాలా సమయం ఉండటంతో.. విజయదశమి కానుకగా జైలర్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ కి జైలర్ రూపంలో భారీ హిట్ పడింది.