Jagan:జగన్ బీజేపీ బానిస..నిజమేనా?

16
- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిసగా ఉన్నారా ? అంటే అవుననే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాజాగా జగన్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ జగన్ బీజేపీకి బానిసగా ఉన్నారని, అలాంటప్పుడు బీజేపీ అంటే గిట్టని వైఎస్ఆర్ కు జగన్ వారసుడేలా అవుతారాని షర్మిల వ్యాఖ్యానించారు. నిజానికి జగన్ బీజేపీ మద్య అంతర్గత ఒప్పందాలు ఉన్నాయనేది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న మాట. జగన్ అక్రమస్తుల కేసులోనూ, వివేకా మర్డర్ కేసులోనూ కేంద్రం జగన్ కు అండగా నిలుస్తోందని అందుకే ఆయన బీజేపీ పై ఎలాంటి ప్రతికూల విమర్శలు చేయడం లేదని గతంలో ఈ రకమైన వార్తలు బాగానే వినిపించాయి. .

కానీ అనూహ్యంగా బీజేపీ ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమితో చేతులు కలిపింది. అంటే జగన్ కు ప్రత్యర్థిగా రాష్ట్రంలో బీజేపీ పని చేస్తున్నప్పటికి కేంద్ర బీజేపీ మాత్రం జగన్ కు అనుకూలంగానే ఉందనేది చాలమంది అభిప్రాయం. అందుకే ఇప్పటివరకు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనపై విమర్శలు చేసినంతగా బీజేపీపై చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీ మధ్య ఉన్న దోస్తీని షర్మిల బయట పెట్టె ప్రయత్నం చేస్తుండడంతో అసలు ఏపీ రాజకీయాలు ఎటు టర్న్ అవబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, తమకు ఏ పార్టీతోను పొత్తు అవసరం లేదని జగన్ గతంలో చాలాసార్లు చెపుకొచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ బీజేపీ మధ్య దోస్తీ ఉండబోదనేది మరికొందరి అభిప్రాయం. మరి ప్రస్తుతం బీజేపీ విషయంలో జగన్ పై వినిపిస్తున్న విమర్శలు వైసీపీకి ప్రతికూలంగా మారతాయా ? లేదా అనేది చూడాలి.

Also Read:టిల్లు కోసం వస్తున్న దేవర!

- Advertisement -