వామ్మో.. ఏపీలో ముందస్తు ఎన్నికలా ?

50
- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని పదే పదే చెబుతూనే ఉన్నాయి. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు నిజంగానే రాబోతున్నాయా అనే దానిపై వైసీపీ ప్రభుత్వం గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోయేది లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అమద్య కన్ఫర్మ్ చేశారు. అయినప్పటికి ఈ వార్తలు ఆగడం లేదు. ఎందుకంటే ఈ మద్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ముందస్తు ఎన్నికలకు సూచనగానే భావిస్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు.

వైసీపీ కీలక పదవులలో మార్పులు చేయడం, అలాగే ఆయా విభాగాల్లో అధికారుల మార్పులు వంటివి చేపట్టారు సి‌ఎం జగన్.. అంతే కాకుండా తరచూ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచిస్తూ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని.. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ;సిద్దంగా ఉండాలని వైఎస్ జగన్ చెబుతున్నారు. జగన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలను బట్టి విపక్ష పార్టీల నేతలు సైతం ముందస్తు ఎన్నికలకు సిద్దమౌతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పర్యావసనంతో ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు మరోసారి చెప్పుకొచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి తాజాగా మరోసారి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కన్ఫర్మ్ చేశారు ఆయన. వెంటిలేటర్ పై ఉన్న పార్టీలే ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నాయని, తమకు ఆ అవసరం లేదని సజ్జల చెప్పుకొచ్చారు. అక్రమ సంబంధాన్ని పవిత్రం చేయడానికే చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారని వారిద్దరి భేటీను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గుంటనక్కలు, పంది కొక్కులు ఏకం అవుతున్నాయంటూ సజ్జల విమర్శించారు. మొత్తానికి పవన్, చంద్రబాబు బేటీతో ఏపీ రాష్ట్ర రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి…

ఏపీ బీఆర్ఎస్‌..దూకుడు పెంచిన కేసీఆర్

ఇక రణమే.. పవన్ సమరశంఖం !

చంద్రబాబుతో పవన్‌ భేటీ..

- Advertisement -