Jagan:రాజధాని ఏది..జగన్?

85
- Advertisement -

ఏపీలో రాజధాని అంశం మరోసారి చర్చకు దారితీస్తోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకుచ్చిన సంగతి విధితమే. అయితే మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఉద్యమ బాటపట్టడంతో ఆ ప్రతిపాదనకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఇక అప్పటి నుంచి ఏపీ క్యాపిటల్ విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తుంటే ఉంది. మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదే లేదని జగన్ సర్కార్ చెబుతుంటే.. కోర్టు నుంచి మాత్రం అనుమతి రావడం లభించడం లేదు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టి విశాఖను మాత్రమే రాజధానిగా ప్రకటించే ప్రయత్నం చేశారు. .

విశాఖ నుంచి పాలన సాగిస్తామని, త్వరలో అని ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం అవుతాయని జగన్ గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. ఇక ఈ డిసెంబర్ లో విశాఖకు షిఫ్ట్ అవ్వడం గ్యారెంటీ అని కూడా తేల్చి చెప్పారు. కానీ డిసెంబర్ కూడా పూర్తి కావస్తున్నా.. ఇంకా రాజధానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇక మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలు కాబోతుంది. ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్వయంగా జగనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రాజధాని అంశం మరుగున పడినట్లేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే రాజధాని అంశంపై ప్రజలు ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు జగన్ ఎలా సమాధానమిస్తారో చూడాలి.

Also Read:రికార్డుల మోత..సౌతాఫ్రికా చిత్తు!

- Advertisement -