అశ్విన్ ను తీసుకోవడం కరెక్టేనా?

21
- Advertisement -

భారత్ వేధికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లు ఇండియా చేరుకున్నాయి. నేటి నుంచి వార్మప్ మ్యాచ్ లు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబర్ 8 న ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా తొలి మ్యాచ్ అడనుంది. ఆసియా కప్ మరియు ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కైవసం చేసుకోని పూర్తి ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్ బరిలో దిగబోతుంది టీమిండియా. ఇప్పటికే జట్టు కూర్పుపై కూడా బారిగానే కసరత్తులు చేసి తుది జట్టును ఆల్రెడీ ప్రకటించింది.

బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాలో ఆల్రౌండర్ల కొరత కొంత వేధిస్తోంది. హర్ధిక్ పాండ్య ఒక్కడే ఆల్రౌండర్ బాద్యతను భుజాన వేసుకున్నాడు. కాగా వరల్డ్ కప్ జట్టులో మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మొదట స్థానం సంపాధించుకున్నాడు. అయితే ఆసియా కప్ చివరి మ్యాచ్ లో గాయపడిన అక్షర్.. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ కూడా ఆడలేదు. దాంతో అప్పటి నుంచే జట్టులో అతడి స్థానంపై సందేహాలు వ్యక్తమౌతూ వచ్చాయి.

ఇక ఇటీవల అక్షర్ స్థానంలో అనూహ్యంగా రవిచంద్రన్ అశ్విన్ కు చోటు కల్పించింది బీసీసీఐ. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను కంగుతినిపించే అశ్విన్ ను తీసుకోవడం మంచిదే అంటున్నారు కొందరు. లోయర్ ఆర్డర్ లో అశ్విన్ కు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉండడంతో వరల్డ్ కప్ లో అశ్విన్ మంచి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వన్డేలలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అశ్విన్.గత ఆరేళ్లలో అశ్విన్ ఆడింది కేవలం ఆరు వన్డేలు మాత్రమే. ఈ ఆరు వన్డేలలో కూడా అటు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ ఫెళవ గణాంకాలే నమోదు చేశాడు. మరి వరల్డ్ కప్ లో ఈ వెటరన్ స్పిన్నర్ ఎలాంటి ప్రదర్శన కాబరుస్తాడో చూడాలి.

Also Read:ఉమ్మడి వ్యూహం..ఉమ్మడి మేనిఫెస్టో?

- Advertisement -