రాత్రి పూట తేనె తినడం మంచిదేనా?

52
- Advertisement -

తేనె ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్య ఔశదం అనే సంగతి అందరికీ తెలిసిందే. సహజ సిద్దంగా ప్రకృతి ప్రసాదించే ఆరోగ్య సంజీవిని గా తేనె ను పరిగణిస్తూ ఉంటారు. తేనె లోని ఔషధ గుణాలు ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా పారద్రోలే శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, మలబద్దకం, అజీర్తి,. ఇలా ఏ సమస్య వచ్చిన తేనె ద్వారా చక్కటి పరిష్కారం పొందవచ్చు. అందుకే తేనెను ఎప్పుడు పడితే అప్పుడు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. అయితే తేనె రాత్రిపూట తినకూడదని, తింటే ఆరోగ్యానికి మంచిది కాదని ఒక అపోహ చాలమందిలో ఉంది. నిజానికి తేనె రాత్రిపూట తింటే ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. .

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ తేనె తినడం వల్ల శరీరం ట్రీఫ్టోఫాన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది సుఖమైన నిద్ర రావడానికి తోడ్పడుతుంది. అంతే కాకుండా ఎలాంటి ఒత్తిడి దరిచేరకుండా చూస్తుంది. సాధారణంగా అధిక రక్తపోటు గుండె జబ్బులకు కారణం అవుతుంది. అయితే ప్రతిరోజూ పడుకునే ముందు తేనె తీసుకుంటే రక్త పోటు అదుపులోకి వస్తుందట. ఇంకా తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోదక శక్తిని పెంచడంలో సహాయ పడతాయట. ఇంకా రాత్రి పూట తేనె తింటే శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. తద్వారా బాడీలోని వ్యర్థమైన కొవ్వు కరిగి బరువు వేగంగా తగ్గవచ్చట. ఇంకా గొంతు, నొప్పి పొడి దగ్గు ఉన్నవారు పగటిపూట కంటే రాత్రి పడుకునే ముందు తేనె సేవిస్తే వాటి నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు తేనె తినడం వల్ల చాలానే లాభాలు ఉన్నాయని అందువల్ల నిరభ్యంతరంగా తేనె తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:సీడబ్ల్యూసీలో లెక్క తేలుతుందా?

- Advertisement -