ఇకపై TS కాదు TG..కేబినెట్ నిర్ణయాలివే

27
- Advertisement -

తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీగా మార్చాలని నిర్ణయించింది.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ తీర్మానం చేయగా 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకంతో పాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆరు గ్యారంటీల అమలుపై చర్చించినట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు 100 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.

Also Read:తమలపాకుతో ప్రయోజనాలు..

- Advertisement -