కాంగ్రెస్ వ్యూహాలు ఫలిస్తాయా?

27
- Advertisement -

2024 సార్వత్రిక ఎన్నికలపై అందరిలోనూ ఇప్పటినుంచే క్యూరియాసిటీ నెలకొంది. ఎందుకంటే గత 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దాంతో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన కాషాయ పార్టీకి దేశ ప్రజలు మళ్ళీ అధికారం కట్టబెడతారా ? లేదా ఇతర పార్టీల వైపు చూస్తారా ? అనే ప్రశ్నలతో పాటు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విపక్షాలు ఏం చేయబోతున్నాయనేది కూడా ఆసక్తికరమే. ముఖ్యంగా వచ్చే ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం అనే చెప్పాలి. ఈసారి ఎన్నికల్లో ఫలితం ఏ మాత్రం బెడిసి కొట్టిన దేశంలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతుంది.ఇప్పటికే చాలా రాష్ట్రలో కాంగ్రెస్ బలం కోల్పోయింది. .

అంతే కాకుండా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కూడా ఆయా రాష్ట్రాలలో తెరపైకి వస్తున్నాయి. దీంతో పూర్వవైభవం పొందాలంటే హస్తం పార్టీ ముందున్న లక్ష్యం వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే. అందుకోసం హస్తం పార్టీ వెస్తోన్న వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ద్వారా ఆ పార్టీకి మంచి మైలేజ్ వచ్చిందనే చెప్పాలి. అయితే కేవలం స్వశక్తిని నమ్ముకుంటే విజయం కష్టమని భావిస్తున్న హస్తం పార్టీ.. అల్ట్రానేట్ వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించడం కోసం విపక్షలను ఏకం చేసే పనిలో పడింది కాంగ్రెస్. దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేక శక్తులను కూడా గట్టడం ద్వారా బీజేపీని సులభంగా ఎదుర్కోవచ్చని హస్తం నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యాలే ఇందుకు నిదర్శనం. వచ్చే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకం కావాలని.. అప్పుడు బీజేపీని ఎదుర్కోవడం సులభం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ విపక్ష కూటమికి కాంగ్రెస్ పార్టీనే నేతృత్వం వహిస్తుందని, ఇప్పటికే ఇతర పార్టీ నేతలతో కూడా చర్చలు మొదలు పెట్టినట్లు ఖర్గే చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ తో కలిసేందుకు ఏ ఏ పార్టీలు ముందుకొస్తాయనేది చెప్పడం కష్టమే. దేశ వ్యాప్తంగా అంతో ఇంతో గుర్తింపు ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కాంగ్రెస్ తో కలవడం ప్రశ్నార్థకమే. ఒకవేళ ఆయా రాష్ట్రాలలోని కొన్ని పార్టీలతో కాంగ్రెస్ కూటమి ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల నాటికి సమీకరణలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. మరి కాంగ్రెస్ వ్యూహాలు ఎలాంటి ఫలితాలిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -