Revanth:సంతకం ఓకే.. మరి అమలు?

36
- Advertisement -

ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని ఎలా అమలు చేస్తుందనే డౌట్ చాలమందిలో వ్యక్తమౌతు వచ్చింది. ఎందుకంటే హస్తం పార్టీ ప్రకటించిన ఆరు హామీలు కూడా భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటి అమలు దాదాపు అసాధ్యం అనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట. ఒకవేళ అమలు చేసిన వేల కోట్లు అదనపు ఖర్చు భరించాల్సివస్తుంది. ఇలా ఆరు గ్యారెంటీల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న వేళ నేడు సి‌ఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ హామీలపైనే చేశారు. దీంతో ఆరు హామీలు కూడా త్వరలోనే ప్రజల్లోకి వెళ్లనున్నాయనేది స్పష్టమవుతోంది. అయితే ఈ ఆరు హామీలు ఓకే సారి అమలు చేస్తారా ? లేదా దశల వారీగా అమలు చేస్తారా అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దశల వారిగానే వీటి అమలు ఉండే అవకాశం ఉందట. మరి కాంగ్రెస్ ధీమాగా చెబుతూ వచ్చిన ఈ ఆరు గ్యారెంటీ హామీల అమలు ఎలా జరుగుతుందో చూడాలి.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు :
*మహాలక్ష్మి పథకం – ప్రతి మహిళకు నెలకు రూ.2500, మరియు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్.
*రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000 పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు రూ. 12,000, వరి పంటకు రూ.500 బోనస్.
*గృహ జ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు.
*యువ వికాసం – విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు.
*చేయూత – రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా రూ.10 లక్షలు, నెలవారి పెన్షన్ రూ. 4,000
*ఇందిరమ్మ ఇల్లు – ఇల్లు లేనివారికి ఇంటి స్థలాలు రూ.5 లక్షల సాయం.

Also Read:రేపటి నుండి ప్రజాదర్బార్:సీఎం రేవంత్

- Advertisement -