ప్రజల కోసం ప్రజాదర్బార్:సీఎం రేవంత్

31
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మాట్లాడిన రేవంత్..ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం..తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం అన్నారు.ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలని, సామాజిక న్యాయం చేయాలని ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే ఆలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలుపెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియాగాంధీ ఉక్కు సంకల్పం, కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, తెలంగాణ నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనిందన్నారు. ఈ మంత్రి వర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.

రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావుపూలే ప్రజా భవన్ లో (ప్రగతి భవన్) ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల హక్కులను కాపాడటానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భధ్రతలను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంతోనే పోటీపడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేద వాళ్లకు, నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ నిస్సహాయులు ఎవరు కూడా మాకు ఎవ్వరూ లేరు. ఏ దిక్కూ లేదనే పరిస్థితులను రానీయకుండా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మువ్వన్నెల జెండాను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. మీ కష్టాన్ని శ్రమను గుర్తు పెట్టుకుంటా, గుండెల నిండా నింపుకుంటా. పదేండ్లు కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునేవే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా అన్నారు. ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు. ఈ రోజు నుంచి మా విద్యార్థి, నిరుద్యోగ , అమర వీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

రేపు ఉదయం జ్యోతీరావు పూలే భవన్ లో 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహించాలని దానికి మీరందరూ పెద్ద ఎత్తున ఆమోదం తెలుపాలని, చప్పట్లతో స్వాగతం పలుకాలని మీ అందరిని కోరుతున్నాను.ప్రమాణ స్వీకారంలో మీరందరు కుటుంబ సభ్యులుగా పాల్గొని మీతోపాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సహచర రాజకీయ పార్టీలు, ఇండియా కూటమిలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న చాలా రాజకీయ పార్టీలు, నా సహచర పార్లమెంటు సభ్యులు ఈ శుభ కార్యములో ఇందిరమ్మ రాజ్య ప్రక్రియలో పాల్గొన్నారు. వారందరికీ తెలంగాణ ప్రజల తరపున మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలుపాలని కోరుకుంటున్నా మిత్రులారా. ధన్యవాదాలు.ఆరు గ్యారంటీల అమలుకు మార్గం సుగమం చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేశారు రేవంత్ రెడ్డి. అలాగే ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగిని రజినీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైలుపై సంతకం చేశారు.

Also Read:మంత్రులు – శాఖల వివరాలు

- Advertisement -