యూ ట్యూబ్‌ని షేక్ చేస్తున్న పుష్పరాజ్!

10
- Advertisement -

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పుష్ప 2 ది రూల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సింగిల్ మాట లేకుండా కేవలం మ్యూజిక్‌తోనే విడుదలైన టీజర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. మిలియన్స్ వ్యూస్‌తో పాటు లైక్‌లను సొంతం చేసుకుంది. గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్ కట్ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అల్లు అర్జున్ ఇందులో చీరకట్టి.. కాలు వెనక్కి మడిచి పైట కొంగుని అందుకున్న తీరు చూస్తుంటే.. ‘పుష్ప2: ద రూల్’ నీయవ్వ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుందనే హింట్‌ని ఇచ్చేస్తోంది.

ఆగస్ట్ 15, 2024 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఫాహద్ ఫజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, బ్రహ్మాజీ, రావు రమేష్, ధనంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పుష్ప 2 టీవీ రైట్స్‌ను స్టార్ మా కొనుగోలు చేసింది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం టీవీ ప్రీమియర్ గా స్టార్ మాలో ప్రసారం కానుంది.

బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read:ముంచుకొస్తున్న ఏఐ..30 కోట్ల ఉద్యోగాలు మాయం!

- Advertisement -