కొబ్బరినీళ్ళు అతిగా తాగితే ప్రమాదమా?

23
- Advertisement -

సాధారణంగా కొబ్బరినీళ్ళు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తరచూ వింటూనే ఉంటాం. ఎందుకంటే ఇందులో మనశరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు మినరల్స్ చాలానే ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్, వంటి వాటితో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ వంటివి కూడా అధికంగా ఉంటాయి, మన శరీరానికి ఇన్స్టంట్ గా శక్తిని ఇవ్వడంలోనూ, రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ కొబ్బరినీళ్ళు ఎంతగానో ఉపయోగ పడతాయి. అందుకే ఏదైనా నిస్సత్తువ, బలహీనతతో బాధపడే వారు కొబ్బరి నీళ్ళు తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్ళు అతిగా త్రాగిన ప్రమాదం పొంది ఉందట. .

ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధ పడే వారు కొబ్బరినీళ్ళను మితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. అతిగా తాగితే మూత్రపిండ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందట. కొబ్బరి నీళ్ళలో సాధారణంగానే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం మన శరీరంలో ఎక్కువైతే మూత్రపిండాల పనితీరుపై ప్రభావం పడుతుందట. ఇక రక్తపోటు సమస్య ఉన్నవాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళను మితంగానే తాగాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్!

ఇందులో ఉండే సోడియం రక్తపోటుకు మరింత కారణం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ శక్తి కోసం కొబ్బరినీళ్ళు తగాల్సివస్తే వైద్యుల సలహా మేరకు తాగడం మచిదట. ఇంకా బీపీ ఎక్కువగా ఉన్నవారు కొబ్బరినీరు ఎక్కువగా తాగితే పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉందట. ఇంకా అధిక బరువు ఉన్నవాళ్ళు, సిస్టిక్ ఫైబ్రోసిస్ తో బాధ పడే వారు కూడా కొబ్బరి నీళ్ళకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొబ్బరి నీళ్ళు మన ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో భాద పడే వారు తప్పకుండా వీటికి దూరంగా ఉంటలని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:పిక్ టాక్ : అందాలతో అదరగొట్టింది

- Advertisement -