షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్!

36
- Advertisement -

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎలక్షన్స్ పై దృష్టి సారిస్తోంది. ఇటీవల పార్లమెంట్ లో జమిలి ఎలక్షన్స్ పై బిల్లు ప్రవేశ పెట్టె అవకాశం ఉందని భావించరంతా కానీ అలాంటిదేమీ జరగలేదు. దాంతో ఎన్నికల షెడ్యూల్స్ లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదని విశ్లేషలకులు చెబుతూ వచ్చారు. కానీ మళ్ళీ జమిలి ఎలక్షన్స్ అమలు కై తో తొలి కమిటీ ఇవాళ సమావేశం అయింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ అద్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో అమిత్ షా, గులాం నాభి ఆజాద్ తదితరులు ఉన్నారు. ఈ కమిటీ నేడు నేడు సమావేశం కావడంతో మరోసారి జమిలి ఎన్నికల అంశం హాట్ టాపిక్ అయింది. .

అయితే ఇటు తెలంగాణలో ఎన్నికలపై నో కన్ఫ్యూజన్ అంటోంది రాష్ట్ర ఎన్నికల కమిటీ. ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తాజాగా స్పష్టం చేశారు. ఎన్నికలకు కేవలం మూడు నెలలే సమయం ఉందని, తెలంగాణ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పుకొచ్చారయన. దీంతో ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ అంతా కూడా వికాస్ రాజ్ చేసిన వ్యాఖ్యలతో పటాపంచలు అయిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేస్ లో ముందుంది. అటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఎన్నుకోవడంలో తర్జన భర్జన పడుతూనే ఉన్నాయి. మొత్తానికి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు కన్ఫర్మ్ కావడంతో ఇకపై తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగనున్నాయి.

Also Read:ఆడియన్స్‌ని అలరించే ‘చంద్రముఖి 2’

- Advertisement -