పవన్ ఆశలపై బీజేపీ నీళ్ళు చల్లుతోందా?

98
- Advertisement -

ఏపీలో జనసేన బీజేపీ మద్య పొత్తు ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికలకు బీజేపీ జనసేన కలిసి వెళ్తాయంటూ అటు పవన్, ఇటు బీజేపీ నేతలు ఇద్దరు ప్రకటించారు. అయితే టీడీపీ విషయంలో మాత్రం జనసేన సానుకూలంగా స్పందిస్తున్నప్పటికి భాజపా నుంచి ఎలాంటి స్పందన లేదు. టీడీపీ, బీజేపీ మద్య కొన్ని అభ్యంతర కర పరిస్థితులు ఉన్నాయని అందుకే ఆ రెండు పార్టీలు పొత్తుపై తేల్చుకోవడం లేదని స్వయంగా పవనే ఆ మద్య వ్యాఖ్యానించారు. దానికితోడు ఎన్డీయే మిత్రపక్ష కూటమికి టీడీపీకి ఆహ్వానం అందక పోవడంతో టీడీపీతో పొత్తు ఆలోచనను బీజేపీ విరమించుకుందా అనే అన్బుమణలు వ్యక్తమౌతున్నాయి.

ఒకవేళ టీడీపీ కలవక పోతే బీజేపీ జనసేన పార్టీలు కలిసి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే ఇపుడు ఈ రెండు పార్టీల ఉమ్మడి సి‌ఎం అభ్యర్థి ఎవరనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. నిన్నమొన్నటి వరకు ఈ రెండు పార్టీల ఉమ్మడి సి‌ఎం అభ్యర్థిగా పవన్ పేరే ఎక్కువగా వినిపించింది అయితే ప్రస్తుతం రేస్ లోకి బీజేపీ తరుపున ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి వచ్చింది. ప్రత్యర్థి పార్టీలపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించడంలోనూ, అలాగా రాజకీయ చతురత ప్రదర్శించడంలోనూ పురందేశ్వరిది ప్రత్యేకమైన శైలి. అందుకే ఏరికోరి ఆమెకే అద్యక్ష భాద్యతలు కట్టబెట్టింది బీజేపీ అధినాయకత్వం.

Also Read:‘మిస్టర్. X’లో సుప్రీం స్టార్ శరత్ కుమార్

ఇక ఆమె అధ్యక్ష పదవి చేపట్టినది మొదలుకోని చురుకుగా తనదైన రీతిలో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన ఉమ్మడి సి‌ఎం అభ్యర్థిగా పురందేశ్వరిని నియమిస్తే ఎలా ఉంటుందనే దానిపై కాషాయ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారట. ఇదే గనుక నిజం అయితే పవన్ సి‌ఎం కావాలనే ఆశలపై బీజేపీ నీళ్ళు చల్లినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అధికారం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దపడే బీజేపీ.. సి‌ఎం అభ్యర్థి విషయంలో పవన్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం లేదనేది కొందరి విశ్లేషకుల మాట. మరి బీజేపీ సి‌ఎం అభ్యర్థిగా పురందేశ్వరి వైపు ఆ పార్టీ మొగ్గు చూపితే పవన్ బీజేపీతో దోస్తీని అలాగే కొనసాగిస్తారా ? లేదా పొత్తు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి.

Also Read:విజువల్ ట్రీట్‌గా ‘ఖుషి’టైటిల్ సాంగ్

- Advertisement -