బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా?

30
- Advertisement -

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గా ఉన్న టైమ్ లో కరెంట్ కోతల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తుంది. ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అంచనా వేయలేని పరిస్థితి. కరెంటు కోతల కారణంగా రైతాంగం ఏడాదికి ఒక్క పంట తీయడమే గగనమైన రోజులు. ఆనాడే తెలంగాణ కరెంటు కష్టాలను గుర్తించిన కే‌సి‌ఆర్.. తాను అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కరెంటు కష్టాలు ఉండకూడదని, అహర్నిశలు శ్రమించి ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా సాహసోపేతమైన అడుగు వేసి 2017 డిసెంబర్ 31 న 24 గంటల ఉచిత కరెంట్ కు నాంది పలికారు. అప్పటి నుంచి రాష్ట్రంలో కరెంటు కోత అనే మాట రాకుండా రైతులకు కరెంట్ అందిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నారు. .

తెలంగాణలో అమలుతున్న 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముక్కున వేలేసుకునే పరిస్థితి. అయితే కళ్ళముందు అభివృద్ది కనిపిస్తున్న మింగుడు పడని నేతలు మన రాష్ట్రంలో ఉన్నారంటే అది ఎంత దౌర్భాగ్యమో కదా ! కళ్ల ముందు ఉచిత కరెంటు అమలుతున్న కాదు కాదు అని మాసిపూసి మారేడు కాయ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఒకవైపు ఉచిత కరెంటు అమలుతో రైతులు ఏడాదికి మూడు పంటలు తీస్తూ ఆనందంగా ఉన్నవేళ.. దీన్ని కూడా రాజకీయం చేయడం ఒక్క బిజెపి నేతలకె చెల్లింది.

Also Read:ఇదేనా బీజేపీ సమన్యాయం?

తాజా లోక్ సభలో తెలంగాణ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత కరెంటు అమలు జరగడం లేదని వ్యాఖ్యానిస్తూ 24 గంటల కరెంటు అమలుతుందని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్దం అంటూ చెప్పుకొచ్చారు. దీంతో బండి సంజయ్ రాజీనామా చేయాలని సామాన్యులు సైతం డిమాండ్ చేస్తున్నారు. కళ్ల ముందు అమలౌతున్న అభివృద్ది కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పరువును కేంద్రం కళ్ల వద్ద ఉంచే నువ్వు కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని సామాన్యులే బండి సంజయ్ కి బుద్ది చెబుతున్నా పరిస్థితి. ఇలాంటి ఎన్ని నిరాధార ఆరోపణలు చేసిన కల్లబొల్లి విమర్శలు గుప్పించిన తెలంగాణ ప్రజానీకం కే‌సి‌ఆర్ పక్షాన ఉందనేది జగమెరిగిన సత్యం.

- Advertisement -