రాష్ట్రంలో అవినీతి ఉంది … ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి అని ఒక్క మాట అన్నందుకు సీఎం వైయస్ జగన్ ఏకంగా వంద బాణాలు సంధించారు.. బిజెపి …టీడీపీ వాళ్ళు సమాధానం ఇవ్వలేని విధంగా ఎదురుదాడి చేశారు… వాస్తవానికి జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాల్లేవు.
# 2014 -19 మధ్య బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు ఆ తరువాత కూటమి నుంచి వైదొలగిన తరువాత చంద్రబాబు మోసగాడని మోడీ ఆరోపించారు..పోలవరాన్ని మంటగలిపారని.. అభివృద్ధి లేనేలేదని… కొడుకుకోసమే తప్ప ప్రజలకోసం చంద్రబాబు రాజకీయం చేయడం లేదని మోడీ దుమ్ముదులిపారు.. మరి అదే చంద్రబాబు ఇప్పుడు నీతిమంతుడు అయ్యారా ? వీరుడు సూరుడు అయ్యారా ? మరి ఏమి మార్పు గుర్తించి ఆయన్ను మళ్ళీ నెత్తికి ఎత్తుకుని మోస్తున్నారు అని జగన్ ప్రశ్నలు సంధించారు.
# మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అలాంటి పార్టీతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారు… వీళ్ళిద్దరూ మన రాష్ట్ర ఆస్తిని అమ్మేస్తుంటే మేం చూస్తూ ఊరుకుంటామా… ప్రజలు కానీ ఎన్డీయేకు ఓటేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఒప్పుకున్నట్లే … మేము అధికారంలో ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగింది..లేకుంటే ఈపాటికి అదెప్పుడో జీర్ణం అయ్యేది అని జగన్ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది ఆలోచింపజేసింది..
# మోసగాడు బాబును ఎందుకు గెలిపించాలి.. ఆయన్ను మీరెందుకు మోస్తున్నారు…వత్తాసుపలుకుతున్నారు అంటూ మోడీని జగన్ ప్రశ్నించి ఎదురుదాడి చేశారు.
Also Read:ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక..