UBT:ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్!

1
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీ మరో భారీ చీలిక వైపు అడుగులు వేస్తోందని ఆ పార్టీకి చెందిన 14 నుండి 16 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు వచ్చే వారంలో పార్టీని వీడటానికి సిద్ధమవుతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. 2022లో ఏకనాథ్ షిండే తిరుగుబాటు తర్వాత ఉద్ధవ్ క్యాంప్‌కు ఇది రెండో అతిపెద్ద ఎదురుదెబ్బ కానుంది.ఇదే జరిగితే మహారాష్ట్ర రాజకీయ చిత్రం మరోసారి పూర్తిగా మారిపోనుంది.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) సంక్షోభం చుట్టూ తిరిగిన రాజకీయ చర్చలు, ఇప్పుడు ఒక్కసారిగా శివసేన (UBT) వైపు మళ్లాయి. ఉద్ధవ్ క్యాంప్ ఎంపీలను తమ వైపు తిప్పుకోవడానికి ఏకనాథ్ షిండే వర్గం ఆపరేషన్ టైగర్ చేపట్టిందనే వార్తలు శివసేన (UBT) లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ ఊహాగానాలు తీవ్రం కావడంతో ఉద్ధవ్ థాక్రే ముంబైలోని తన నివాసమైన ‘మాతోశ్రీ’ లో అత్యవసరంగా పార్టీకి చెందిన 9 మంది లోక్‌సభ ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మేము పాత సహచరులం కాబట్టి అప్పుడప్పుడు కలుస్తుంటాం. అంతమాత్రాన వారు పార్టీ మారుతున్నారని కాదు. కానీ వారితో మాట్లాడినప్పుడు చాలా మంది థాక్రే, సంజయ్ రౌత్ తీరుపై అసంతృప్తితో ఉన్నారని అర్థమైందన్నారు శిండే వర్గం ఎంపీ ప్రతాప్‌రావ్ జాదవ్. తాము ఎవరిని కలిసినా అనుమానిస్తున్నారని మాతోశ్రీకి తమకు సరైన యాక్సెస్ లేదని వారు భావిస్తున్నారు. వారిలోని ఈ అసంతృప్తి గనుక బద్దలైతే …కొందరు పార్టీ వీడటం ఖాయం. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్న మాట నిజమేనని తెలిపారు.

మరోవైపు ఉద్ధవ్ క్యాంప్ ఎంపీ అరవింద్ సావంత్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. TMC విషయంలో పేర్లు బయటపెట్టినట్లు, మా పార్టీ నుండి వెళ్లే ఆ ఏడుగురు ఎంపీల పేర్లను ఎందుకు బహిరంగపరచడం లేదు? అక్కడ ఏ ‘టైగర్’ లేదు…వారికి పళ్ళు కూడా లేవు అని చెప్పారు.ఈ ప్రచారాన్ని ఏకనాథ్ షిండే శివసేన అధికారికంగా తిరస్కరించింది. ఇతర పార్టీలను చీల్చడంలో తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆ పార్టీ నాయకురాలు షైనా మంగళవారం స్పష్టం చేశారు.

మాకు ఏ పార్టీని విరిచే ఉద్దేశం లేదు. మా నాయకుడు ఏకనాథ్ షిండే ప్రజాదరణను అందరూ చూస్తున్నారు. ఆయన ఇంట్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేస్తున్నారు. ప్రజలు ప్రతిరోజూ మా పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఇక్కడ నడుస్తోంది ‘ఆపరేషన్ టైగర్’ కాదు, మహారాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్న ‘ఆపరేషన్ ప్రోగ్రెస్ అని ఆమె పేర్కొన్నారు.

Also Read:తనపై జరిగిన దాడి..విన్యాసమే:అభిజిత్

- Advertisement -