- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ రీ-రిలీజ్ కానుంది. ఆగస్టు 22, 2026న 4K అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లో థియేటర్లలోకి రానుంది ఈ కల్ట్ క్లాసిక్ మూవీ.
జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ బ్లాక్‌బస్టర్ మూవీ. చిరంజీవి కామెడీ, శ్రీకాంత్ ఏటీఎం పాత్ర, సోనాలి బింద్రే నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో మరోసారి వెండితెరపై అలరించనుంది మెగా మూవీ. 4K క్లారిటీతో సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Also Read:నెట్‌ఫ్లిక్స్‌లో ‘సూపర్ సుబ్బు’
- Advertisement -

