తెలంగాణకు తీరని లోటు…

219
Irrigation expert R Vidyasagar Rao no more
- Advertisement -

ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, టీఎస్ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలంగాణ జాతికి తీరని లోటని అన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణకు దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ అని కొనియాడారు. తనకు పెద్దన్నలా విద్యాసాగర్ రావు వ్యవహరించేవారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో మనతో పాటు ఉండాల్సిన విద్యాసాగర్ రావు… అర్థాంతరంగా మనల్ని వదిలి వెళ్లిపోవడం బాధాకరమని చెప్పారు.

ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని తాను భావించానని… ఇలా జరుగుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రాజెక్టుల పునరాకృతిలో ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేశారు. విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆయన ప్రాణాలను దక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశామని… కానీ, ఫలితం దక్కలేదని తెలిపారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై ఆయన చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యమైనదని సిఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ, సలహాలుఇస్తూ ముందుకు నడిపారన్నారు.

ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించాలనే స్వప్న సాకారంలో భాగస్వామిగా ఉండాల్సిన విద్యాసాగర్ రావు అర్థాంతరంగా మనల్ని వదిలివెళ్ల‌డం బాధాక‌ర‌మ‌న్నారు. విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తీవ్ర అనారోగ్యం కారణంగా విద్యాసాగర్ రావు హాస్పిటల్ లో చేరిన తర్వాత… అక్కడకు వెళ్లి కేసీఆర్ పరామర్శించారు. అంతేకాదు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు.

- Advertisement -