విద్యాసాగర్ రావు ఇకలేరు…

196
Vidya sagar rao is no more
- Advertisement -

సాగునీటిరంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామరాజు విద్యాసాగర్‌రావు ఇక లేరు. కాంటినెంటల్ ఆస్పత్రి ఐసీయూలో  చికిత్సపొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.  కొంతకాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో ఈ వ్యాధికి శస్ర్త చికిత్స చేయించుకున్నారు. ఇటివలే మ‌ళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో కాంటినేంటల్ ఐసియు వేంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు.

విద్యాసాగర్ రావు ఆరోగ్య పరిస్ధితి మంత్రి హరీష్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. ‘విద్యన్నా.. నేను కేసీఆర్‌నొచ్చిన’ అంటూ ఆయనను  పలకరించారు.  విద్యాసాగర్ రావు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు .తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

విద్యాసాగర్ రావు సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం. ప్రస్తుతం ఈ ఊరు యాదాద్రి జిల్లాలకి పోయింది. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు విద్యాసాగర్ రావు. 1979లో రూర్కీ యూనివర్సిటీ నుంచి వాటర్ రీసోర్స్ డవలప్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. 1983న యుఎస్‌ఏలో ఉన్న కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్స్ సిస్టమ్స్ పై డిప్లొమా చేశారు. 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు.

సెంట్రల్ వాటర్ కిషన్ లో ఇంజినీర్ గా కెరీర్ ప్రారంభించిన విద్యాసాగర్ రావు.. వివిధ రాష్ట్రాల్లో పని చేశారు. చీఫ్ ఇంజినీర్ స్థాయిలో రిటైర్ అయ్యారు. మనదేశం తరఫున ప్రపంచ దేశాల్లో పర్యటించి, అక్కడి నీటిపారుదల రంగంపై అధ్యయనం చేశారు. వాటిని ఇక్కడి అమలు చేసి.. బీడు భూములకు నీళ్లు పారించారు. మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నారు. ఇండియన్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు, ఇరిగేషన్ మేనేజ్ మెంట్ బోర్డుల్లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు ముఖ్యమంత్రికి పూర్తి సహాయ సహకారాలందించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయనను కేసీఆర్‌ సర్కారు సాగునీటి ముఖ్య  సలహాదారుగా నియమించింది. కాగా విద్యాసాగర్‌ రావు రెండేళ్ళుగా కేన్సర్‌తో బాధ పడుతున్నారు. ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి నగరానికి వచ్చినతర్వాత కూడా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దాంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేర్చి కీమో థెరఫీ చికిత్స అందిస్తున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

- Advertisement -