తమన్నాకు ఇదే మొదటిసారి..

322
Tamanna New Movie With Vikram
- Advertisement -

తెలుగులో ఒకప్పుడు తమన్న ఎడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుండేది.మరి ‘బాహుబలి 2’ తరువాత ఈ మిల్కీ బ్యూటీ చేసే తెలుగు సినిమాలేవీ కనిపించడం లేదు. కథలు వింటుంది కాని ఏ ఒక్క సినిమా ఒప్పుకోలేదట. మరి తెలుగులో ఈ అమ్ముడి హవ తగ్గిందని వార్తలు షికారు చేస్తున్నాయి.ఇక తమిళంలో మాత్రం తమన్నా రెండు మూడు సినిమాలు చేస్తోంది .. అందులో విక్రమ్ సినిమా ఒకటి. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘స్కెచ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారనే సంగతి తెలిసిందే. మరి ఈ మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పరిస్థితి ఇప్పుడు ఏంటా అనే క్వశ్చన్ చాలా మందిలోనే ఉంది. గతేడాది వచ్చిన అభినేత్రి.. కత్తి సాందాయ్ లు తమ్మూకు ఉపయోగపడింది ఏమీ లేదు. ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ మూవీ రిలీజ్ అయినా.. దాని కారణంగా తమన్నాకి ఉపయోగపడింది పెద్దగా ఏమీ లేదని తెలుస్తుంది

Tamanna New Movie With Vikram

ఇక శింబుతో నటిస్తున్న ఏఏఏ మూవీలో ముగ్గురు భామల్లో ఒకరిగా మిల్కీ సాధించేది పెద్దగా ఉండకపోవచ్చు. ఇవి కాకుండా పెళ్లి చూపులు తమిళ్ రీమేక్ ఒక్కటే తమన్నా చేతిలో ఉన్న సినిమా. ఆమె రేంజ్ కి చేతిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఇప్పటివరకూ ఆశ్చర్యం కలిగించేదే. అయితే.. త్వరలో తన కొత్త ప్రాజెక్టులు వెల్లడవుతాయని తమన్నా గత నెలలో చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది. తాజాగా చియాన్ విక్రమ్ 53వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేశారు.

చీరలో తమ్మూ లుక్ కాసింత కొత్తగానే కనిపిస్తోంది. స్టార్ హీరో సినిమా ఏదీ లేదని అనుకుంటున్న సమయంలో.. విక్రమ్ తో మూవీ ఛాన్స్ అంటే పెద్ద విషయమే. విజయ చందర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో తొలుత ప్రేమమ్ ఫేమ్ సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు ఆ ఛాన్స్ తమన్నా చేతిలో వాలింది. అయితే ఈ సినిమాలో అమ్మడు బ్రాహ్మణ యువతి పాత్రలో కనిపించనుందట. పద్ధతిగా .. సంప్రదాయ బద్ధంగా పాఠాలు చెప్పే పంతులమ్మ పాత్రను ఆమె పోషిస్తోందని అంటున్నారు. ఈ సినిమాలోని కొన్ని సందర్భాల్లో ఆమె మడికట్టుకుని మరీ కనిపిస్తుందట. ఈ తరహా పాత్రలో తాను కనిపించనుండటం ఇదే మొదటిసారి అనీ .. ఈ సినిమా తనకి మరింత మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో తమన్నా వుంది.

- Advertisement -