హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది:ఇరాన్

10
- Advertisement -

వాస్తవానికి హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. నిజానికి హర్మూజ్ జలసంధి మూసివేయలేదు. అయితే మా శత్రువులైన దేశాలకు చెందిన ట్యాంకర్లు, నౌకలకు మాత్రమే అనుమతి లేదు. మమ్మల్ని దాడి చేస్తున్న దేశాలు మరియు వాటి మిత్రదేశాల నౌకలకు మాత్రమే ఇది మూసివేయబడింది. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు స్పష్టం చేశారు.

అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలు మరియు ఆయిల్ ట్యాంకర్లకు మాత్రమే ఈ జలసంధి మూసివేశామని, ఇతర దేశాల నౌకలకు ఎలాంటి అడ్డంకి లేదని ఆయన స్పష్టం చేశారు. భద్రతా ఆందోళనల కారణంగా చాలా నౌకలు ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడటం లేదని ఆయన చెప్పారు. అయితే దీనికి ఇరాన్ కారణం కాదని ఆయన పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యం మరియు ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా యుద్ధ నౌకలను పంపాలని ఆయన సూచించారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలు తమ నౌకలను పంపాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ చర్య ద్వారా బహుళ దేశాల నౌకాదళం కలిసి పనిచేసి హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచే ఉంచాలని ఆయన భావిస్తున్నారు.

Also Read:పెట్రోల్ లేదా డీజిల్‌ను నిల్వ చేయవద్దు:కేంద్రం

- Advertisement -