ఒలింపిక్స్‌పై ఆసక్తికర సర్వే!

263
olympics
- Advertisement -

నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. పతకాల వేటలో ఎవరు గెలుస్తారు..ఏ దేశం అద్భుత ప్రదర్శన కనబరుస్తుందనే దానిపై తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్‌పై నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయం వెల్లడైంది.

క‌రోనా నేపథ్యంలో ప్రముఖ అథ్లెట్లు ఈసారి టోర్నీకి దూరంగా ఉండ‌టంతో.. టోక్యోలో జ‌ర‌గ‌నున్న ఒలింపిక్స్‌పై ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేద‌ని సర్వేలో వెల్లడైంది.ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో స‌ర్వే నిర్వ‌హించగా కేవ‌లం 35 శాతం మంది మాత్ర‌మే ఒలింపిక్స్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు వెల్లడించారు.ఆతిథ్య దేశం జ‌పాన్‌లో ఈ గేమ్స్ షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గాల‌ని కేవ‌లం 22 శాతం మంది మాత్ర‌మే కోరుకున్నారు.

ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానుండగా క‌రోనా కార‌ణంగా ఈ గేమ్స్‌కు ప్రేక్ష‌కులెవ‌రినీ అనుమ‌తించ‌డం లేదు.

- Advertisement -