గోపిచంద్- శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబో..!

171
gopichand

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా నటించిన లక్ష్యం. ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు శ్రీవాస్. గోపిచంద్‌కు హీరోగా ఈ సినిమా మంచి గుర్తింపు నివ్వగా శ్రీవాస్‌ కూడా మంచి మార్కులు కొట్టేశాడు. తర్వాత వీరి కాంబోలో వచ్చిన మరో చిత్రం లౌక్యం.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్‌ తర్వాత మళ్లీ వీరి కాంబోలో చిత్రం రాబోతుంది.

ఈ విషయాన్ని మేకర్స్‌ స్వయంగా వెల్లడించారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 30వ చిత్రం. సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఓ పోస్టర్‌ని రిలీజ్ చేయగా కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి మ‌రియు ప్రజలు గూమికూడి ట్రాఫిక్‌తో ఉన్న కోల్‌కత్తాలో ఫేమస్‌ కాళీమాత విగ్రహం కనిపిస్తుండగా సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.

ప్రస్తుతం గోపీచంద్ మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌పక్కా కమర్షియల్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంట‌నే ఆయన 30వ మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.