ఐపీఎల్‌16…బుమ్రా దూరం నిజమేంత?

16
- Advertisement -

టీమ్‌ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గత కొన్ని నెలలుగా జట్టుకు దూరమయ్యారు. వెన్ను గాయం కారణంగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్న బుమ్రా…మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్16 సీజన్‌లో ఆడతాడని ప్రచారం జరిగింది. కానీ వెన్ను నొప్పి కారణంగా ఈ సారి బుమ్రా ఐపీఎల్‌ దూరం కానున్నట్టు ప్రచారం. ఇంకా గాయం నుంచి పూర్తిస్థాయిలో కోలుకోకపోవడమే కారణమని వెల్లడించారు. గాయం ముందుగా అంచనా వేసిన దానికంటే తీవ్రమైనదని అతడు కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని బీసీసీఐ ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.

ఇక జూన్‌లో లండన్‌లో జరిగే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా అర్హత సాధిస్తే ఆమ్యాచ్‌కల్లా కూడా బుమ్రా ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు కనిపించడం లేదని…ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నారు. ఇదే యేడాది జరిగే ఆసియా కప్‌ టోర్నీ వరకు లేదా వన్డే ప్రపంచకప్‌ వరకైనా బుమ్రాను సిద్ధం చేయాలని బీసీసీఐ యోచిస్తుంది. ఒక వేళ అలా జరగకపోతే ఈ సారి కూడా ప్రధాన టోర్నీలో బుమ్రా ఆటకు దూరమవ్వనున్నారు. అయితే బుమ్రా చివరిసారిగా 2022సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడారు.

ఇవి కూడా చదవండి…

ఆరోసారి విజేతగా ఆసీస్..

సెమీఫైనల్లో చిత్తైన భారత్..

శ్రీవారి సన్నిధిలో సూర్యకుమార్ యాదవ్..

- Advertisement -