ఐపీఎల్ 17 సీజన్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. గతంలో ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ లో పరుగుల వరద పారుతోంది. ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. 2013లో ఆర్సీబీ చేసిన హయ్యెస్ట్ స్కోర్ 263 పరుగులను దాదాపు పదేళ్ళ తరువాత ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరబాద్ జట్టు (277) అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ రికార్డ్ ఇప్పట్లో చెరగదని అందరూ భావించారు. కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్ కతా హయ్యెస్ట్ స్కోర్ రికార్డ్ కు దగ్గర్లో వచ్చి ఆగిపోయింది. .
డిల్లీ క్యాపిటల్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ మద్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. డిల్లీ పై ఏకంగా 106 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోల్ కతా బ్యాట్స్ మెన్స్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించారు. నరైన్ (85), రఘువంశీ (54), రసెల్ (41), రింకూ సింగ్ (26).. సిక్సర్ల వర్షం కురిపించారు. కోల్ కతా బ్యాట్స్ మెన్స్ ధాటికి డిల్లీ బౌలర్స్ చేతులెత్తేశారు. భారీ లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన డిల్లీ 166 పరుగులకే కుప్పకూలింది. దీంతో కోల్ కతా వరుసగా మూడు విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
నరైన్ దంచుడు
కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ బౌండరీల మోత మోగించాడు. 39 బంతుల్లోనే 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అయితే గతంలో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే నరైన్ ఓపెనర్ గా ఎంట్రీ ఇచ్చి కోల్ కతా తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించాడు. నరైన్ ఇచ్చిన సూపర్ ఓపెనింగ్ తోనే కోల్ కతా రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
Also Read:TTD: 5న డయల్ యువర్ ఈవో
పంత్ ఈజ్ బ్యాక్
రోడ్ యాక్సిడెంట్ లో గాయపడి దాదాపు ఏడాది కాలం క్రికెట్ కు దూరమైన రిషబ్ పంత్.. ఈ సీజన్ ఐపీఎల్ తోనే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే యాక్సిడెంట్ తరువాత పంత్ బ్యాటింగ్ లో పదును తగ్గిందేమో అని భావించిన వాళ్ళకి గత రెండు మ్యాచ్ లతో గట్టిగానే సమాధానం చెప్పాడు. సిఎస్‌కే తో ఆడిన మ్యాచ్ లో 51( 32 బంతుల్లో ), కేకేఆర్ తో ఆడిన మ్యాచ్ లో 55(25 బంతుల్లో ) చేసి పంత్ ఈజ్ బ్యాక్ అనిపించాడు.
ఇక నేడు జరిగే ఐపీఎల్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడనుంది.