IPL 2023:గుజరాత్‌పై రాజస్థాన్ గెలుపు

42
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది రాజస్థాన్. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.గుజ‌రాత్ టైటాన్స్ నిర్దేశించిన 178 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కొల్పోయి ఛేదించింది.

రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో సంజు శాంస‌న్‌ 32 బంతుల్లో 6 సిక్స్‌లు,3 ఫోర్లతో 60 పరుగులు చేయగా హెట్ మ‌య‌ర్‌ 24 బంతుల్లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లతో 56 పరుగులు చేసి జట్టును గెలిపించారు. చివర్లలో అశ్విన్ 3 బంతుల్లో 1 ఫోర్,1 సిక్స్‌తో 10 పరుగులు చేశారు.

అంత‌క‌ముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఏడు వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల్ల‌ర్‌(46), శుభ్‌మ‌న్ గిల్‌(45), హార్ధిక్ పాండ్యా(28), అభిషేక్ మ‌నోహ‌ర్‌(27) లు రాణించారు.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -