నేటి ఐపీఎల్ మ్యాచ్ లు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాయి. మద్యాహ్నం 3:30 నిముషాలకు వఖాండే స్టేడియంలో కోల్ కతాతో ముంబై తలపడనుంది. అలాగే రాత్రి 7:30 నిముషాలకు నరేంద్ర మోడి స్టేడియంలో రాజస్తాన్ తో గుజరాత్ తలపడనుంది. రెండు కూడా ఆసక్తికరమైన మ్యాచ్ లు కావడంతో అభిమానులకు ఫుల్ వినోదం ఖాయమనే చెప్పాలి. వరుస ఓటములతో డీలా పడ్డ ముంబై గత మ్యాచ్ లో డిల్లీ పై గెలిచి ఈ సీజన్ లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక అదే జోరు నేడు కోల్ కతా తో జరిగే మ్యాచ్ లో కూడా కొనసాగించాలని ముంబై పట్టుదలగా ఉంది. ఇక గత మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. .
మరోవైపు గత మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయిన కేకేఆర్ ఈ మ్యాచ్ తో తిరిగి మళ్ళీ గాడిలో పడాలని చూస్తుంది. కేకేఆర్ ప్రస్తుతం అన్నీ విభాగాల్లో బలంగా ఉన్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోల్ కతా ను ఎంతమేర కట్టడి చేస్తుందో చూడాలి. ఇక రాత్రి 7: 30 నిముషాలకు గుజరాత్ మరియు రాజస్తాన్ మద్య మ్యాచ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. వరుస విజయాలతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాయల్స్ తో సమానంగా గుజరాత్ కూడా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడింట్లో విజయం సాధించి దూకుడు మీద ఉంది. ఈ రెండు జట్లు కూడా సమవుజ్జీలుగా ఉనడంతో విజయం ఏ జట్టును వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక గత సీజన్ లో ఫైనల్ లో తలపడిన ఈ రెండు జట్లు.. రాజస్తాన్ ను ఓడించి గుజరాత్ కప్పు ఎగరేసుకుపోయింది. దాంతో ఈ సీజన్ లో ఈ రెండు జట్లు తలపడుతుండగా గుజరాత్ పై ప్రతీకారం తీరుచుకోవాలని రాజస్తాన్ పట్టుదలగా ఉంది. బలాబలాల విషయంలో ఇరు జట్లు సమానంగా ఉండడంతో గెలుపు కోసం ఉత్కంఠ పోరు నడిచే అవకాశం ఉంది. మరి ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..