IPL 2023 :వావ్.. వాట్ ఏ మ్యాచ్!

47
- Advertisement -

ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లు పంచే వినోదం అంతా ఇంతా కాదు. అనుక్షణం ఉత్కంఠతో విజయం ఇరు జట్ల మద్య దొబుచులాడుతుంటే.. మైదానంలోని ప్లేయర్స్ లో టెన్షన్ అటువైపు అభిమానుల్లో టెన్షన్.. చివరికి గెలుపుపై అసలు లేని జట్లు అనూహ్య విజయం సాధిస్తే.. ఆ గెలుపులో ఉండే మాజా గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతినే పంచింది నిన్న జరిగిన కోల్ కతా వర్సస్ గుజరాత్ మ్యాచ్. నరేంద్ర మోడి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరును కోల్ కతా ముందు ఉంచింది.

సై సుదర్శన్ ( 38 బంతుల్లో 53 పరుగులు ), విజయ్ శంకర్ ( 24 బంతుల్లో 63 పరుగులు ) మెరుపులు మెరిపించడంలో గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. ఇక ఆ తరువాత ఛేజింగ్ కు దిగిన కోల్ కతా.. మొదట్లో కాస్త తడబడింది ఓపెనర్స్ గుర్బజ్, జగదీశన్ వెనువెంటనే ఔట్ అయ్యారు. ఆ తరువాత జట్టులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ ( 40 బంతుల్లో 80 పరుగులు ), నితీశ్ రాణా ( 29 బంతుల్లో 45 పరుగులు ) మెరుపులు మెరిపించారు.

కాగా చివరి ఓవర్లో గెలుపుకోసం 29 పరుగులు అవసరం కాగా.. కోల్ కతా గెలుపు కష్టమే అని భావించరంతా.. కానీ ఊహించని విధంగా రింకు సింగ్ చివరి ఓవర్లో ఏకంగా 5 సిక్సులు బాదడంతో విజయం కోల్ కతా ముంగిట వాలింది. కాగా ఈ మ్యాచ్ ఎన్నో రికార్డులకు వేధికైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో బౌలర్ హ్యాట్రిక్ వికెట్స్ సాధించాడు. ఇది రషీద్ ఖాన్ కు 4వ హ్యాట్రిక్. ప్రపంచ టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక హ్యాట్రిక్ సాధించిన బౌలర్ గా రషీద్ ఖాన్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇక కోల్ కతా తరుపున చివర్లో విధ్వంసం సృష్టించిన రింకు సింగ్ చివరి ఓవర్ లో ఏకంగా 5 సిక్సులు బాది ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ ఫినిషర్ గా రికార్డ్ సాధించాడు. మొత్తానికి గుజరాత్ వర్సస్ కోల్ కతా మద్య జరిగిన మ్యాచ్ అనుక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించేలా సాగింది. ఇక నేటి ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు మరియు లక్నో తలపడనున్నాయి. రాత్రి 7:30 నిముషాలకు చినస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -