IPL 2023:హైదరాబాద్ ఓటమి

72
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా సొంతగడ్డపై మరో ఓటమిని మూటగట్టుకుంది హైదరాబాద్. ఢిల్లీ విధించిన 145 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 137 పరుగులు చేసింది. దీంతో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.మయాంక్ అగర్వాల్ 49 పరుగులు చేశాడు,హెన్రిచ్ క్లాసెన్(19 బంతుల్లో 31 పరుగులు), వాషింగ్టన్ సుందర్(15 బంతుల్లో 24 పరుగులు) పరుగులు చేశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీశ్ పాండే(27 బంతుల్లో 34 పరుగులు), అక్షర్ పటేల్(34 బంతుల్లో 34 పరుగులు) రాణించారు. డేవిడ్ వార్నర్(21), మిచెల్ మార్ష్(25) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు.

Also Read:సుమ గొంతు పట్టుకున్న హీరో..అసలు ఏమైంది..!

- Advertisement -