సుమ గొంతు పట్టుకున్న హీరో..అసలు ఏమైంది..!

35
- Advertisement -

గోపిచంద్‌ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న మూడవ చిత్రం రామబాణం. మే5న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గోపిచంద్‌కు లౌక్యం లక్ష్యం లాంటి సూపర్ హిట్‌తో శ్రీవాస్ తో కలసి చేస్తున్న ఈ మూడవ సినిమా. అన్ని ఫార్మట్‌లో, అన్ని హంగులతో రూపుదిద్దుకున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ మూడవ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో సినిమా ప్రమోషన్స్‌ జోరుగా పెంచింది.

Also Read: రామబాణం..నువ్వే నువ్వే పాటను లాంచ్‌ బై శ్రీలీల

ఈ సందర్భంగా బుల్లితెర యాంకర్ సుమ హోస్ట్‌ చేస్తున్న సుమ అడ్డాలో కూడా పాల్గొన్నారు. ఈ షోకు గోపిచంద్, డింపుల్‌ హయాతీ, దర్శకుడు శ్రీవాస్, కమెడీయన్ గెటప్ శ్రీను ఈ షోలో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రోమోను విడుదలై నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ ప్రోమోలో గోపిచంద్‌ సెటైర్‌ డింపుల్ స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు.

Also Read: కంగనా ది బెస్ట్‌ యాక్ట్రెస్:మాధవన్

అయితే గేమ్‌ ఆడుతూ మధ్యలో గోపిచంద్‌ ఒక్కసారిగా వైల్డ్‌గా బిహేవ్‌ చేయడం ప్రారంభించారు. అయితే అంతేగాకుండా యాంకర్ సుమ గొంతు కూడా పట్టుకున్నారు. అయితే సడేన్‌గా షాక్‌కు గురైన టీం మెంబర్స్, షో నిర్వహకులు కూడా విస్తుపోయారు. సుమ గొంతును గోపిచంద్‌ ఎందుకు పట్టుకున్నారని తెలియాలంటే ఏప్రిల్ 29న టెలికాస్ట్ అయ్యే పూర్తి ఎపిసోడ్‌తో తెలిసిపోతుంది. అయితే ఈ సినిమాలో జగపతి బాబు ఖుష్బూ నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -