కోల్‌క‌తాపై చెన్నై ఘ‌న విజ‌యం

46
- Advertisement -

IPL 2023లో భాగంగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది చెన్నై. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో చెన్నై 49 పరుగుల తేడాతో గెలుపొందింది.కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో జేస‌న్ రాయ్‌(61; 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), రింకూసింగ్‌(53నాటౌట్‌; 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. అజింక్యా ర‌హానే(71నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) శివ‌మ్ దూబే(50; 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) రాణించారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో కుల్వంత్ ఖేజ్రోలియా రెండు వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Also Read:Director Puri Jagannath:పూరీ.. నెక్స్ట్ ఏంటి ?

- Advertisement -