శుక్రవారం ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రసవత్తరమైన పోరు జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ – కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. మ్యాచ్లో సన్ రైజర్స్ మరోసారి టాస్ గెలిచింది. టాస్ గెలిచిన విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈసారి ఐపీఎల్ లో 10 జట్లు ఆడుతుండగా, టాప్-4 ఈ స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. దాంతో ప్రతిమ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో సన్ రైజర్స్ నేటి మ్యాచ్ బరిలో దిగనుంది.
ఇక, సన్ రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయంతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మరో ఆల్ రౌండర్ సుచిత్ ను తీసుకుంది. ఇక, కేకేఆర్ కూడా మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆరోన్ ఫించ్, అమన్ ఖాన్ ల్ని తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక, షెల్డన్ జాక్సన్ సామ్ బిల్లింగ్స్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తుది జట్లు :
సన్రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, జగదీషా సుచిత్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
కోల్ కతా నైట్ రైడర్స్ వెంకటేశ్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, సునీల్ నరైన్, కమిన్స్, ఉమేశ్ యాదవ్, అమన్ ఖాన్, వరుణ్ చక్రవర్తి