ఐపీఎల్‌ 2020@ కరోనా కండీషన్స్ అప్లై

198
ipl
- Advertisement -

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా క్రికెట్‌ను వదల్లేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఇటీవలె క్రికెట్ టోర్నమెంట్‌లు ప్రారంభంకాగా ఐపీఎల్‌కు కూడా మార్గం సుగుమమైంది.యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. మొత్తం 60 మ్యాచ్‌లు 51 రోజుల పాటు జరగనుండగా నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇక టోర్నీ ప్రారంభానికి నెల రోజుల ముందు అన్ని ప్రాంఛైజీల ఆటగాళ్లు యూఏఈ చేరుకోనున్నారు. పూర్తిగా కరోనా నిబంధనల ప్రకారం ఐపీఎల్ టోర్నమెంట్ జరగనుంది.ఈ మేరకు ఆటగాళ్లకు సూచనలు కూడా చేసింది బీసీసీఐ.

యూఏఈ కి బయలుదేరే ముందు రెండు సార్లు అక్కడికి వెళ్లిన తర్వాత మరో రెండు సార్లు అంటే మొత్తం నాలుగు కరోనా పరీక్షలు చేయనున్నారు. నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లకు మాత్రమే బయో- సెక్యూర్ బబుల్‌‌లోకి వెళ్తారు. ఇక ఒకసారి ఆ బబుల్ లోకి వెళ్లిన క్రికెటర్ మళ్ళీ బయటికి రావడానికి ఉండదు.ఆటగాళ్లు ప్రయాణించే బస్ డ్రైవర్, హోటల్‌లో పనిచేసే సిబ్బందికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయని బీసీసీఐ అధికారులు తెలిపారు.

- Advertisement -