‘ఇంతలో ఎన్ని ఎన్ని వింతలో’

208
Inthalo Yennenni Vinthal movie
- Advertisement -

హరి హర చలన చిత్ర పతాకం పై హ్యాపెనింగ్ యంగ్ హీరో నందు నటిస్తోన్న నూతన సినిమా ఇంతలో ఎన్ని ఎన్ని వింతలో. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్ వరికూటి ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటాకేనాయుడు విడుదల చేశారు. నందుతో పాటు స్వామీరారా ఫేమ్ పూజా రామచంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా షెడ్యూల్స్ మొత్తం ముగించుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. వేసవి కానుకగా మే నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -