ఇవాళ అంతర్జాతీయ యువజన దినోత్సవం. ప్రతీ ఏటా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు.ఆస్ట్రియాలోని వియన్నాలో 1991లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన మొట్టమొదటి సెషన్‌కి హాజరైన యువత ఇంటర్నేషనల్ యూత్ డే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఐక్యరాజ్య సమితికి నిధుల సమీకరణలో సాయపడేందుకు ఈ ప్రతిపాదన చేశారు. 1998లో లిస్బన్‌లో జరిగిన వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ యూత్ ఫస్ట్ సెషన్‌లో ఆగస్టు 12వ తేదీని ఇంటర్నేషనల్ యూత్ డేగా అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత తొలుత ఇంటర్నేషనల్ యూత్ డేని ఆగస్టు 12, 2000న నిర్వహించింది.
యువతకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన కల్పించడం, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, పర్యావరణ తదితర అంశాల్లో యువత పాత్రను, ప్రాధాన్యతను తెలియజెప్పడం ఈ రోజు ప్రత్యేకత. సమాజంలో తరాల మధ్య అంతరాన్ని తగ్గించడం, వయోభార సమస్యలకు పరిష్కార మార్గాలే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక వివిధ దేశాల్లో జాతీయ యువజన దినోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. భారత్‌తో స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారు. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి స్వామి వివేకానంద. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి. అందుకే వివేకానంద జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా బారత్ జరుపుతోంది.
Also Read:వయానాడ్‌కు రాహుల్ గాంధీ
యువతపై నా నమ్మకం.. ఏ సమస్య పరిష్కారానికైనా వారు సింహాల్లా పనిచేస్తారు-స్వామి వివేకానంద
యువత శక్తి ఈ ప్రపంచానికి ఉమ్మడి ఆస్తి వంటిది. యువకులే ఈ ప్రపంచానికి భూత, వర్తమాన, భవిష్యత్. సమాజంలోని ఏ రంగం యువత శక్తికి, వారిలోని ఆసక్తి, ఉత్సాహానికి, ధైర్యానికి, ఆదర్శవాదానికి సరితూగదు.-కైలాష్ సత్యార్థి
యవ్వనంలో ఏర్పడే మంచి అలవాట్లు వారి జీవితాన్ని మార్చివేస్తాయి-అరిస్టాటిల్
ప్రస్తుత కాలంలో యువతరానికి రాజకీయాలు అంటే చెడు అభిప్రాయం ఉన్నప్పటికీ, కొంతమందిలో నేటి రాజకీయాలను మార్చాలి అనే ఆలోచన బలంగా ఉంది. కానీ సరియైన అవకాశాలు లేక, తోడ్పాటు లేకపోవడం, వారికి పార్టీల పెద్దలు నమ్మకం, భరోసా ఇవ్వక పోవడం వల్ల వెనుకడుగు వేస్తున్నారు. అందుకే నేటి యువతరం రాజకీయాలలోకి వచ్చి దేశాన్ని మీ ఆలోచనలతో అభివృద్ధి చేయాలి…అప్పుడే మరింత మార్పు వచ్చి సరికొత్త ఆవిష్కరణలకు ముందడుగు పడే అవకాశం ఉంది.
Also Read:హారర్ థ్రిల్లర్… ‘పిజ్జా3’