తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు సుమారు రెండు వందలకు పైగా మహిళలు వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన వారందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, టాక్ సంస్థ మహిళా నాయకత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి, సంస్థ చేపడుతున్న సాంస్కృతిక సేవా కార్యక్రమాలను సభకు వివరించారు. మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుందన్నారు. ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్నారు.వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారని, ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలనీ పురుషుల కన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనీ,దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారనీ, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం అని అన్నారు. స్థానికంగా మన స్వదేశం నుండి వచ్చిన మహిళలు, అమ్మాయిలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వారికి అండగా ఉంటామని అన్నారు.
మన బతుకమ్మను బోనం ను విదేశీ గడ్డపై ఎత్తుకొని మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న ప్రవాస మహిళలందరిని అభినందిస్తూ కృతిగానతలు తెలుపుతున్నాని శుష్మణ తెలిపారు.మన తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత గారి స్ఫూర్తి తో మేమంతా ముందుకు వెళ్తున్నామని, అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ ముందుకు నడిపిస్తునందుకు కవిత కృతఙ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చెయ్యడానికి కొన్ని వారాల నుండి కష్టపడి పని చేసిన టాక్ మహిళా తినిధులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ వేడుకల నిర్వాహణలో ఎంతో సహకరించి ప్రోత్సహించిన టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
టాక్ మహిళా విభాగం కార్యదర్శి క్రాంతి రేతినేని మాట్లాడుతూ దాదాపు వంద మందికి పైగా మహిళలు ఒకేచోటు చేరి మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషాన్ని నూతన స్ఫూర్తిని ఉత్తేజాన్ని ఇస్తుందని , ఈ వేడుకలు ఇంతటి విజయం సాధించడానికి ముఖ్య కారణం ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి కృషి, ఇతర మహిళా సభ్యుల సహాకారం, ముఖ్యంగా టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం గారి మరియు అధ్యక్షుడు రత్నాకర్ గారి ప్రోత్సాహమని వారందరిని ప్రశంశించారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రత్యేకించి మహిళల సంరక్షణ కొరకు, వారి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలని చేపడుతున్నారని. స్థానిక సంస్థలల్లో మహిళా కోటా తెచ్చి మహిళలను మేయర్లని మున్సిపల్ ఛైర్పర్సన్లను చేసిన ఘనత కెసిఆర్ గారిదని, అలాంటి తెలంగాణ రాష్ట్రం, మహిళా సాధికారతలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని క్రాంతి రేతినేని తెలిపారు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, హాజరై టాక్ సంస్థను ప్రోత్సహించిన అతిధులకు కృతఙ్ఞతలు తెలిపారు.టాక్ అడ్వైసరి బోర్డు సభ్యురాలు స్వాతి బుడగం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పురుషులకు ధీటుగా మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారనీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచం అంతా జరుపుకునేదిగా అభివర్ణించారు.టాక్ సంస్థ లో ప్రవాస మహిళలంతా బాగస్వాములవ్వాలని మనమంతా కలిసి ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలు చెయ్యొచ్చని స్వాతి తెలిపారు.
ఎన్నో రకాల ఆటలు, గెలిచిన వారికి బహుమతులు, మహిళలంతా ఇంటి నుండి తీసుకొచ్చిన వివిధ రకాల వంటలను ఒకరికొకరితో పంచుకొని రోజంతా సరదాగా గడిపారు.టాక్ మహిళా సెల్ నాయకురాలు శ్వేతా మహేందర్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి తో పాటు క్రాంతి, సుప్రజ, స్వాతి, విజిత, పావని రత్నాకర్, మౌనిక,శ్వేతా,స్నేహ,ఉమా గణేష్,శ్రీ లక్ష్మి రాకేష్,హారిక, మమతా, నంతిని, దీపాక్షర తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..