జులై 15వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

229
international flight
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జులై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కరోన వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ లో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో విమాన సర్వీసులు నడిపితే ఇంకా ఎక్కువ కేసులు పెరుగుతాయని భావించిన కేంద్రం విమాన సర్వీసుల రద్దును కొనసాగించింది. విదేశాల నుంచి భారత్‌కు అంతర్జాతీయ విమాన రాకపోకలను జూలై 15 అర్ధరాత్రి వరకు నిలిపివేస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

డీజీసీఏ అనుమతి పొందిన కార్గో సర్వీసులకు ఎలాంటి షరతులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది. పరిస్థితిని బట్టి కొన్ని అంతర్జాతీయ సర్వీసులను నడిపే అవకాశం కూడా ఉందని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రయాణాలను నిలిపివేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆగస్ట్ 12 వరకు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తూ రైల్వే బోర్డు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -