ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్కు ధరించాలి..

286
GMR CEO
- Advertisement -

ఈరోజు నుండి ఇతర రాష్టాలకు వెళ్లే డేమోస్ట్రిక్ ఫ్లయిట్స్ ప్రారంభం కావడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జీఎంఆర్ విమానాశ్రయం సీఈవో కిషోర్ తెలిపారు. విమానాల సర్వీసు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయం నుండి 19 విమానాలు ఇతర రాష్టాలకు వెళ్తున్నాయి. 19 ఫ్లయిట్స్ ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ వస్తున్నాయి వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ లు, షానిటైజేషన్ తప్పని సరి. 3 వేల మంది ప్రయాణికులు ఈరోజు ప్రయాణిస్తున్నారు.కరోనాలక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారిని ప్రభుత్వ వైద్య బృందం చేత పరీక్షలు నిర్వహించి క్వారెంటాయిన్ లకు పంపిస్తున్నాం. కరోనా లక్షణాలు లేని వారికి క్వారెంటాయిన్ అవసరం లేదు నేరుగా ఇంటికి పంపిస్తాం అని కిషోర్ అన్నారు.

కొన్ని విమానాలు ప్రయాణికులు లేక రద్దు కావడం జరిగింది. ఇవాళ 40 విమానాలు రావాల్సి ఉంది కాని కొన్ని విమానాలు రద్దు అయ్యాయి.టికెట్ బుక్ చేసుకొని విమానం రద్దైతే వారి డబ్బులు తిరిగి చెల్లిస్తాం.ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేత్ యాప్ కచ్చితంగా ఉండాలి.లేని పక్షంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవాలి.వచ్చిన ప్రయాణికులకు నగరంలో రవాణా సౌకర్యం యధావిధిగా ఉంది.ప్రతి కారులో డ్రైవర్ చుట్టూ ప్రయాణికుడితో సంబంధం లేకుండా తెర ఏర్పటు చేశామన్నారు.

ప్రతి కారుని పూర్తిగా శానిటేషన్ చేస్తున్నాం.డ్రైవర్‌కు విధిగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.డ్రైవర్ తప్పనిసరిగా మాస్క్ గ్లౌస్ ధరించాలి.ప్రయాణికులకు కూడా కారులలో శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నాం. ప్రయాణికులు కూడా తప్పనిసరిగా మాస్క్ ,శానిటైజర్ ఉపయోగించాలి.

ఒకవేళ రాత్రి 7 తరువాత ఇతర రాష్ట్రాల నుండి వస్తే పోలీసులకు బోర్డింగ్ పాస్,టికెట్ చూపిస్తే సరిపోతుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు కనీసం 3 గంటల ముందు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి.మా సిబ్బందికి అన్ని జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపడుతున్నాం. మంగళవారం నుండి మరిన్ని విమానాలు పెరిగే అవకాశం ఉన్నందున అన్ని చర్యలు చేపడుతున్నామని జీఎంఆర్ విమానాశ్రయం సీఈవో కిషోర్ పేర్కొన్నారు.

- Advertisement -