క్రెడిట్ కార్డుల పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు..

139
- Advertisement -

అంతర్జీతీయ స్థాయిలో క్రెడిట్ కార్డుల మోసానికి పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. నిందితులు కొనేళ్లుగా క్రెడిట్ కార్డుల పేరుతో మోసం చేస్తున్నారు. లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. ఢిల్లీ, మొహాలీ, గాజయబాద్ నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు నవీన్ భూటాని కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి మోసం చేస్తున్నారు. గూగుల్ యాడ్స్ ద్వారా క్రెడిట్ కార్డ్స్ సమాచారాన్ని తీసుకొని వారికి కాల్ చేశారు. మీ కంప్యూటర్‌లో వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యిందని చెప్పి, దాని కోసం సాఫ్ట్ వేర్‌ను కొనుకోవాలని చెప్పి మోసం చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ సీవీవీ నెంబర్, కార్డ్ నెంబర్ తీసుకొని అమౌంట్‌ను క్లోనింగ్ చేస్తున్నారు. పేమెంట్ గెట్ వే ద్వారా లావాదేవీలు చేస్తూ మోసం చేస్తున్నారని సీపీ అన్నారు.

యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ కి చెందిన వేలాది మందిని మోసం చేశారు. మొహాలీ, పంజాబ్ కి చెందిన ఏడుగురు ముఠాను అరెస్ట్ చేశాము. ముఠాకి చెందిన నవీన్ భూటాని కీలక సూత్రధారి, విదేశాల్లో ఉన్న వారిని టార్గెట్ గా చేసుకొని మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు గుర్తించాము. నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి 80 మందితో ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. డార్క్ వెబ్ సైట్, గూగుల్ యాడ్స్ ద్వారా సమాచారాన్ని తీసుకొని, బల్క్ ఎస్‌ఎమ్‌ఎస్ లు పంపి ట్రాప్ చేస్తున్నారు. దుబాయ్‌లో మరో రెండు ముఠాలు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు ముఠా నుండి కోటి పదకొండు లక్షలు నగదు, స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

- Advertisement -