సీఎంతో చిరు భేటీ.. కీలక అంశాలపై చర్చ..

21

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈరోజు మధ్యాహం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి.. పలు అంశాలపై సీఎంతో చర్చించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన లంచ్ మీటింగ్ తో సినిమా టికెట్ల ధరల అంశం, సినీ ఇండస్ట్రీ సమస్యలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. గంటా 15 నిముషాల పాటు సాగిన సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి కలుస్తున్నానని చిరంజీవి జగన్ తో అన్నట్లు సమాచారం.

సీఎం జగన్‌తో సమావేసం చాలా సంతృప్తిగా జరిగిందని చిరంజీవి అన్నారు. పండుగనాడు ఓ సోదరుడిలా ఆహ్వానించి విందు ఇచ్చారన్నారు. కొన్నినెలలుగా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మద్య తర్జనభర్జనలు నెలకొన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి విధివిధానాలు ఖరారు చేసి తుదినిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారని చిరు తెలిపారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సీఎం ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని.. అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను జగన్ కు వివరించినట్లు వెల్లడించారు.