సిద్దిపేట జర్నలిస్ట్ లకు నా సొంత డబ్బులతో 10 లక్షల రూపాయల భీమా సౌకర్యం ను కల్పిస్తానని చెప్పారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విలేకరుల పున:శ్చరణ తరగతులు ఏర్పాటు చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు , టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు హరీశ్.
ఈ సందర్బంగా హరీశ్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్ లకు రాజకీయ నాయకులకు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ముఖ్యం.. జర్నలిజంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి..జర్నలిస్ట్ గా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి అన్నారు. నేటికి నాకు ప్రతిదీ నేర్చుకునే అలవాటు ఉంది.. నేర్చుకోవడం అనేది తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుంది.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ నాయకులకి నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అన్నారు.
Also Read:బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం:ఏపీ మంత్రి
సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత పెడదారి పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు… ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను కంట్రోల్ చేసే విధంగా జర్నలిస్ట్ లు కృషి చేయాలి.. ఇండ్ల మీద లోన్ తీసుకొని ఆర్థికంగా నష్టపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.. సామాజిక అంశాలపై జర్నలిస్ట్ లు పోకస్ చేయాలి…ప్రభుత్వంను కదిలించే వార్తలపై జర్నలిస్ట్ లు దృష్టి సారించాలి. జర్నలిస్ట్ లకు ఉచిత బస్ సౌకర్యం కల్పించే విధంగా అసెంబ్లీలో చర్చిస్తానని చెప్పారు.

