శ్వేతా పాత్రల సామ్రాట్ ఎవరు మన ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చాక శ్వేతా పత్రాల పరంపర చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అని దుయ్యబట్టారు మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి. 20 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు 50 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు ఈ ముఖ్యమంత్రి….ఈ 20 నెలల పాలనలో ప్రజల కోసం పాలన చేస్తున్నాడా లేక ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు…ఢిల్లీ పర్యటన లపై శ్వేతా పత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు.ముఖ్యమంత్రి కి అడ్డంగా దొరకడం అలవాటు,గతంలో కూడా ఓటుకు నోటు లో దొరికాడు….600 రోజుల కాలంలో ఆయన 200 రోజుల పాటు బయట నే ఉన్నాడు అన్నారు. ఆయన గాలి మోటర్లలో తిరగడం గాలి మాటలు మాట్లాడడం పాలనను గాలికి వదిలివేయడం అంతకు మించి ఆయన ఎం చేయలేదు… ఎదురుదాడి తప్ప ఆయన పాలన చేయడం చేతకాదు..ముఖ్యమంత్రి రంకులు, బొంకులు తప్ప ఇంకోటి లేదు అన్నారు.
హామీలు అమలు,ప్రజలకు ప్రయోజనాలు చేయాలని ఆలోచన మాత్రం లేదు… అద్భుతమైన సచివాలయంను కేసీఆర్ నిర్మించారు అందులో పాలన కొనసాగించాలని ఎవరైనా కోరుకుంటారు అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లోని ఇంటి నుండి పాలన కొనసాగిస్తున్నాడు. లేదా ఆయన పాలన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి చేస్తాడు అంటే ఆయన హిడెన్ ఎజెండా ఎదో ఉండి ఉంటుంది..ఢిల్లీ ప్రయాణం కోసం ఆయన సమయం అంత గడుపుతున్నారు అన్నారు.
రాష్ట్రంలో దయనీయంగా మారింది, ఇవాళ సాగునీటి ప్రాజెక్టులు కళ తప్పాయి..గత మా ముఖ్యమంత్రి కేసీఆర్ అయంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జల కళతో ఉన్నాయి అన్నారు. గురుకుల హాస్టల్ లు దయనీయంగా మారాయి.విద్య శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది.ప్రతి రోజు ఎదో ఒక్క దగ్గర ఎదో ఒక్క సంఘటనలు జరుగుతూనే ఉన్నాయ్…ముఖ్యమంత్రి అన్నాడు విద్యాశాఖ నా దగ్గరనే ఉంటె నేను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని…ఢిల్లీలో నాకు అపాయిట్మెంట్ దొరకడం లేదని అన్నాడు. ఇవాళ తెలంగాణ అంటే చులకన భావం,చిన్న చూపు అవుతుంది.ఈ ముఖ్యమంత్రి పాలనలో…నిన్న కూడా పరిపాలన ఏవిధంగా చేయాలో నాకు తెలుసు అంటున్నాడు. మరి హామిలు అమలు ఏమైంది చెప్పాలన్నారు.
మీరు మహిళలకు ఇస్తామన్న 2500 ఎక్కడ పోయాయి.కల్యాణ లక్ష్మిలో ఇస్తామన్న తులం బంగారం ఎక్కడ పోయింది..ఇప్పటివరకు లక్షల పెళ్లిళ్లు అయ్యాయి ఎంత మందికి ఇచ్చారు తులం బంగారం,తెలంగాణ ప్రయోజనాలను ఈ ముఖ్యమంత్రి దెబ్బతిస్తున్నాడు..నిరుద్యోగులు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పని చేశాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నారు.
Also Read:బనకచర్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం:ఏపీ మంత్రి
బిసిల విషయం లో కూడా సంవత్సరంకీ 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి లక్షల కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. మేము శాసన మండలి లో నిలదిశం. అయ్య 20 వేల కోట్లు అన్నావ్ మరి 6 వెల కోట్లు మాత్రమే బడ్జెట్ లో పెట్టరని ఆడిగినం… కేసీఆర్ అయంలో వ్యవసాయం పండుగ అయితే ఇవాళ ఈ ముఖ్యమంత్రి అయంలో వ్యవసాయ రంగం దండుగా అయింది అన్నారు. పురోగమనం లో ఉన్న రాష్ట్రం తిరోగమనం లో పయనిస్తోంది..పోలీసు స్టేషన్ అన్ని కాంగ్రెస్ కార్యకర్తల కార్యాలయాలుగా మారుతున్నాయి అన్నారు.
నిన్న ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి మేము ఖండిస్తున్నాం…ఇప్పటికైనా పాలనను సరిచేసుకోవాలి,ఢిల్లీ పర్యటనపై శ్వేతా పత్రం విడుదల చేయాలి,బిసి రిజర్వేషన్లపై 9వ షెడ్యూల్ లో పెట్టాలి అని అంటున్నాం,9వ షెడ్యూల్ లో పెడితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్నారు. మేము బిసి రిజర్వేషన్లు పై కట్టుబడి ఉన్నాం..42 శాతం రిజర్వేషన్లకు మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు.42 శాతం బీసీలకు రిజర్వేషన్లకు చట్టబద్ధత కావాలని మేము అంటున్నాం అన్నారు మధుసూదనాచారి.

