త‌న బిడ్డ‌కు తాజ్ మ‌హ‌ల్ పేరు పెడ‌తాన‌న్న క్రికెట‌ర్…

310
Inspired by Jonty Rhodes, AB de Villiers wants to name his third child ‘Taj’ over
- Advertisement -

ద‌క్షిణాఫ్రికా విధ్వంస‌క‌ర క్రికెట‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇండియాలో కూడా అత‌డు భారీ ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎటువంటి ఒత్తిడిలో కూడా ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించ‌గ‌ల ఆట‌గాడు. టెస్ట్ , వ‌న్డే లు అని కాకుండా ప్ర‌తి మ్యాచ్ లోనూ త‌న ఆట‌తో మ్యాచ్ ను విజ‌యం వైపు తీసుకెళుంటాడు. అయితే ఐపిఎల్ లో గ‌త కొన్ని సీజ‌న్ ల‌నుండి ఇతన్ని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు టీం కొనుగొలు చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌న బ్యాటింగ్ తో ఏబీ ఇండియాలో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. తాజ‌గా ఏబీ ఇచ్చిన ఓ ఇంట‌ర్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెల‌పారు. త‌న‌కు ఇండియా అంటే ఎంతో ఇష్టం అన్నారు ఏబీ.

Inspired by Jonty Rhodes, AB de Villiers wants to name his third child ‘Taj’ over ‘Karnataka’

ద‌క్షిణాప్రికా క్రికెట్ దిగ్గ‌జం జాంటీ రోడ్స్ తో క‌లిసి ఈ ఇంట‌ర్యూలో పాల్గోన్నాడు ఏబీ డివిలియ‌ర్స్. త‌న వైవాహిక జీవితాన్ని ఇండియాలోనే ప్రారంభించాన‌ని తెలిపాడు. ఇండియాలో ప్రేమ‌కు గుర్తుగా క‌ట్టిన తాజ్ మ‌హ‌ల్ ఎదుల త‌న భార్య పెళ్లిచేసుకొమ‌ని త‌న‌కు ప్ర‌పోజ్ చేసింద‌ని గుర్తుచేశాడు. ఇండియా అంటే త‌న‌కు ఎంతో ప్రేమ‌ని..అంతేకాకుండా త‌న మూడో సంతానానికి ఇండియాకు గుర్తుగా తాజ్ అనే పేరు పెడ‌తాన‌ని తెలిపారు. తాజ్ మ‌హ‌ల్ కు గుర్తుగా త‌న బిడ్డ‌కు తాజ్ డివిలియ‌ర్స్ అని పెడ‌తానిని చెప్పుకొచ్చారు. ఇక జాంటిరోడ్స్ కు కూడా ఇండియా అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఇండియా మీద ప్రేమ‌తో త‌న కూతురికి ఇండియా అని పేరు పెట్టుకున్నాడు.

- Advertisement -