- Advertisement -
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర మహోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దేవస్థాన ఈవో ఆహ్వాన పత్రికను అందించారు. ఆదివారం నిర్మల్ పట్టణం శాస్త్రినగర్ లోని ఆయన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించి, ప్రసాదాలను అందజేశారు.
- Advertisement -