ఈ నెల మొదటి వారంలో ఇండోనేషియాలో జరిగిన ప్రమాదానిక కారణమైన ఫుట్‌బాల్ స్టేడియంను కూల్చివేయడానికి ఆదేశ అధ్యక్షుడు జోకో విడోడో అనుమతినిచ్చారు. ప్రపంచ సాకర్ గవర్నింగ్ బాడీ ఫీఫా అధిపతి జియాని ఇన్ఫాంటినోతో అధ్యక్షుడు సమావేశమైనారు.
మలంగ్‌లోని కంజురుహాన్ స్టేడియంను మేము కూల్చివేసి…ఫిఫా ప్రమాణాల ప్రకారం పునర్నిర్మిస్తామని హామినిచ్చారు. ప్రపంచంలోని అత్యంత ఘోరమైన స్టేడియం విపత్తులలో ఒకటి అని ఈ సందర్భంగా ప్రకటించారు. అంతర్జాతీయ ఫిఫా రూల్స్‌కు అనుగుణంగా కొత్త స్టేడియంను నిర్మిస్తామన్నారు.
అక్టోబర్1న మలాంగ్ నగరంలో జరిగిన లీగ్ మ్యాచ్ తర్వాత ఘోరమైన తొక్కిసలాట వలన సూమారు 200మంది వరకు చనిపోయారని ఇందులో సూమారుగా 70మంది చిన్నారులు ఉండటం గమన్హారం. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి టీయర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల అభిమానులు చెల్లా చెదురు కావడంతో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. స్టేడియం నిర్వహణ లోపం కూడా ఒక కారణమని అందువల్లే తొక్కిసలాట జరిగిందన్నారు.