కేంద్ర సాయం కోసం ఢిల్లీకి కేటీఆర్

294
- Advertisement -

రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కోరేందుకు రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు అందించాల్సిన సాయంపై చర్చించనున్నారు.ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వలన తెలంగాణలోని మున్సిపాలిటీల్లో జరిగిన నష్టాన్ని వెంకయ్యకు వివరించనున్నారు.

వర్షాల వల్ల జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో జరిగిన నష్టాన్ని అంచాన వేసి నివేదిక అందజేయాలని ఇప్పటికే కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.ఈ మేరకు మున్సిపల్ శాఖ వివిధ పురపాలికల నుండి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైంది. వర్షాల నష్టంతో పాటు ఇతర పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌళిక వసతులు ప్రాజెక్టుల కోసం కేంద్ర సాయాన్ని కోరనున్నారు కేటీఆర్. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, ఇందుకోసం అవసరమైన నిధులు, కేంద్ర సాయం వంటి అంశాలతో కూడిన ఒక నివేదికను వెంకయ్య నాయుడుకు అందజేయనున్నారు.

తెలంగాణకు అమృత్ ప్రాజెక్టులో భాగంగా కింద 10.73 కోట్ల ప్రోత్సాహ నిధులివ్వనున్నది. ఈ ప్రాజెక్టు గైడ్స్ లైన్ అమలులో క్రీయాశీలకంగా పనిచేసినందుకు తెలంగాణకు ఈ ప్రోత్సహాక నిధులు లభించనున్నాయి. తెలంగాణలో మొత్తం 12 అమృత్ పట్టణాలను కేంద్ర గుర్తించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సెల్స్ అసెస్ మెంట్ రిపోర్టను కేంద్రం క్షుణ్ణంగా పరీశీలన చేసిన తర్వాతా ఈ ప్రోత్సాహకం ఇస్తున్నట్లు మంత్రికి రాసిన లేఖలో పెర్కోన్నది. ఈ నెల 30న ప్రధాని పాల్లోననున్న ఇండో -సాన్ 2016 ( స్వచ్చభారత్ సదస్సు)లో పాల్లోనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు కేంద్ర అహ్వనం పంపింది. ఈ సదస్సులోనే ప్రోత్సహక నిధుల పత్రాలను అందజేయనున్నారు.

- Advertisement -