హైదరాబాద్‌లో పకడ్బందీగా లాక్ డౌన్‌: కేటీఆర్

245
ktr
- Advertisement -

హైదరాబాద్‌లో లాక్‌ డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ లేబోరేటరి ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..14 రోజుల్లోనే ఎంవీఆర్‌డీ ల్యాబ్ ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.

రాష్ట్రంలో కరోనాపై పోరాటికి త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ రోజుల్లో 88 లక్షల కుటుంబాలకు బియ్యం, డబ్బు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోకరోనా పరీక్షల సామర్ధ్యం మరింత పెరిగేలా చూస్తామన్నారు.

హైదరాబాద్‌లోని తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ను ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రారంభించగా ఇక్కడ కరోనా పరీక్షలతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై ఇది పనిచేయనుంది. ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకరాంతో డీఆర్డీవో ఈ ల్యాబ్‌ను రూపొందించింది.

- Advertisement -