- Advertisement -
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 31వరకు దేశ వ్యాప్తంగా రైళ్ల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుండటంతో ఈ వ్యాధి తొందరగా సోకే అవకాశం ఉండటంత ఈనిర్ణయం తీసుకుంది కేంద్రం.సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు యథావిధిగా నడుస్తాయి.
కాగా నేడు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ప్రజలు జనతా కర్ప్యూ లో పాల్గోంటున్నారు. అత్యవసర సేవలు తప్ప మిగతా అన్ని వ్యాపారాలు మూసివేశారు. రైళ్లు, బస్సులు అన్నింటిని రద్దు చేశారు. కాగా దేశ వ్యాప్తంగా 14గంటల కర్ఫ్యూ విధించగా తెలంగాణలో మాత్రం 24గంటల కర్ఫ్యూను విధించారు సీఎం కేసీఆర్.
- Advertisement -