76 ఏళ్ల స్వాతంత్య్ర ఉద్యమం….తరాలుగా బానిస బతుకులు బతికిన జాతికి తనను తాను పాలించుకోవడం తెలిసింది. ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాయి. అయితే మన స్వేచ్ఛ వెనుక.. సమరయోధుల సంకెళ్లున్నాయి. ఆ వీరుల త్యాగాలను, ఆ అమరుల బలిదానాలను గుర్తు చేసుకుంటూ ఆ యోధులకు ఘనంగా నివాళి అర్పిద్దాం.
వ్యాపారం పేరుతో దేశంలో అడుగుపెట్టారు ఆంగ్లేయులు. ఈస్టిండియా కంపెనీతో భారత ప్రజలను బానిసలను చేసి సర్వం దోచుకున్నారు. పూర్తిగా భారతదేశం మీదనే దృష్టి సారించింది.1613లో భారతదేశ పశ్చిమ తీరంలోని సూరత్ నగరంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నారు. బొంబాయి, మద్రాసు, కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన వ్యాపార కేంద్రాలుగా నిలిచిపోయాయి. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ వ్యూహాల్లో సైన్య సహకార ఒప్పందం ఒకటి. దీని కారణంగా భారతీయ రాజ్యాలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయి, బ్రిటిష్ వారికి దాసోహమైపోయాయి.
క్రమక్రమంగా భారత సైన్యంపై ఆధిపత్యం చేలాయించడం ఫలితంగా భారతీయ సైనికులు ఉద్యోగాలు కోల్పోయారు. రాజ్యాలు స్వతంత్రం కోల్పోయాయి. సైన్య సహకార ఒప్పందాన్ని అంగీకరించిన తొలి భారతీయ పాలకుడు హైదరాబాద్ నిజాం. భారతదేశంలో సామాజిక మత సంస్కరణల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి రాజా రామ్‌మోహన్ రాయ్. భారతీయ ధార్మిక పతాకాన్ని ఎగరవేసిన చిర యువకుడు స్వామి వివేకానందుడు. హిందూ ధర్మం, అద్వైత వేదాంతం, యోగసూత్రాలను పరిచయం చేశాడు వివేకానందుడు. భారతీయ సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించాలని పిలుపునిచ్చాడు.
భారతీయుల పన్నులతో నిర్మాణమైన రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఎక్కడా భారతీయులకు చోటుండేది కాదు. బ్రిటిష్ కంపెనీ మేజర్ బెనెర్మన్ నేతృత్వంలో కట్టబ్రహ్మన మీద యుద్ధం ప్రకటించి ఆయన్ని ఉరితీశారు. 1857లో సిపాయీల తిరుగుబాటు జరిగింది. మంగళ్ పాండే అనే సిపాయి పూతపూసిన తూటాలను ఉపయోగించేది లేదని తేల్చిచెప్పాడు. అక్కడున్న అధికారులపై దాడిచేశాడు. ఒకరిని చంపేశాడు కూడా. దాంతో ఆంగ్ల ప్రభుత్వం మంగళ్ పాండేను ఉరితీసింది. రెండేండ్ల పాటే సాగినా.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గోదావరి తీరంలోని ఏజెన్సీ ప్రాంతం కేంద్రంగా నడిపిన తిరుగుబాటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది.
Also Read:చేపలు తింటే గుండె జబ్బులు తగ్గుతాయా?
రైతు పోరాటాల మార్గదర్శి నీలిమందు విప్లవం,మరాఠాలను మట్టి కరిపించిన హేస్టింగ్స్, డల్హౌసీ ఎత్తుగడ,ఇల్బర్ట్ బిల్ వివాదం,రైతు పోరాటాల మార్గదర్శి నీలిమందు విప్లవం,అతివాద,మితవాదుల పోరాటం అనేక ఘట్టాలున్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటానికి మారుపేరుగా, దాదాపు 50 ఏండ్లపాటు స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తిమంత్రంగా నిలిచిన గేయం.. వందేమాతరం. ఈ గేయాన్ని ప్రఖ్యాత బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర ఛటోపాధ్యాయ సంస్కృతంలో 1870లో రచించాడు. భారత స్వాతంత్య్ర పోరాటంలో జాతీయవాదుల స్ఫూర్తిమంత్రంగా కీలకపాత్ర పోషించిన వందేమాతరం గేయాన్ని జాతీయ గేయంగా ప్రకటించారు.
భారతీయుల్ని నిరాయుధుల్ని చేసే రౌలట్ చట్టం, జలియన్‌వాలా బాగ్ మారణకాండ, ఖిలాఫత్ నేపథ్యంలో భారతదేశానికి ఒక్క ఏడాదిలోపు స్వాతంత్య్రం వస్తుందనే హామీతో మహాత్మా గాంధీ 1920 ఆగస్టులో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ ఇచ్చిన నినాదంతో స్ఫూర్తి పొందిన ప్రజలు కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. చివరకు భారతీయుల పోరాటం ముందు బ్రిటిషర్లు తలవంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించారు.
Also Read:తెలంగాణలో చంద్రబాబు రిస్క్ చేస్తున్నాడా?